విష్ణువిశాల్‌తో రొమాన్స్ కు రెడీనా? | Ready to romance with vishnuvishal? | Sakshi
Sakshi News home page

విష్ణువిశాల్‌తో రొమాన్స్ కు రెడీనా?

Dec 20 2016 1:14 AM | Updated on Sep 4 2017 11:07 PM

విష్ణువిశాల్‌తో  రొమాన్స్ కు రెడీనా?

విష్ణువిశాల్‌తో రొమాన్స్ కు రెడీనా?

విజయపథంలో పయనిస్తున్న యువ నటులలో విష్ణువిశాల్‌ ఒకరు.

విజయపథంలో పయనిస్తున్న యువ నటులలో విష్ణువిశాల్‌ ఒకరు. ఇటీవల నిర్మాతగానూ మారి వేలన్ను వందుట్టా వెళ్లకారన్ చిత్రంతో సక్సెస్‌ అయ్యారు. తాజాగా కథానాయకన్ పేరుతో చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా కధానాయకి. నవ దర్శకుడు మురుగానందం మెగాఫోన్ పట్టిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ముండాసిపట్టి చిత్రం ప్రేమ్‌ రామ్‌ దర్శకత్వంలో నూతన చిత్రంలో విష్ణువిశాల్‌ నటిస్తున్నారు. ఈ యువ నటుడు మరోసారి దర్శకుడు మురుగానందంకు అవకాశం కల్పించారు.

వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండో చిత్రాన్ని ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా అందాల రాశి హన్సికను ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. ఆమె గ్రీన్  సిగ్నల్‌ ఇవ్వగానే ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ఒక నూతన చిత్రం చేస్తున్న హన్సిక విష్ణువిశాల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు సై అంటారా అన్నది వేచి చూడాల్సిందే. జయంరవితో ఈ బ్యూటీ జత కట్టిన బోగన్ చిత్రం ఈ నెల 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement