breaking news
kathanayakan
-
అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు
అందాలారబోతకు నన్నెవరూ ఒత్తిడి చేయడం లేదని నటి క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. తమిళం, తెలుగు, కన్నడం అంటూ ఏ భాషలో అయినా వచ్చిన అవకాశాన్ని వదలకుండా చేసేస్తున్న ఆ జాణకు ఇటీవల తెలుగు మెగాస్టార్‌తో ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసే అవకాశం చేతి దాకా వచ్చి నోటికందనట్లు చేజారిపోయింది. ప్రస్తుతం తమిళంలో కడంబన్, కథానాయకన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు చెప్పే కబుర్లేమిటో చూద్దామా‘నేను కేరళాలో పుట్టినా పెరిగింది మాత్రం దుబాయ్‌లో. కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయం అయ్యాను.అయితే అప్పటి నుంచే తమిళం, తెలుగు భాషల్లో అవకాశాల కోసం ఎదురు చూశాను. కారణం ఇతర భాషా చిత్రాల్లో కంటే ఈ భాషా చిత్రాల్లో నటనా ప్రతిభను చాటుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది. అలా పా.రంజిత్ దర్శకత్వంలో కార్తీ సరసన మెడ్రాస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అందులో ఉత్తర చెన్నై అమ్మాయిగా నటించడానికి చాలా కష్టపడ్డాననే చెప్పాలి. భాష తెలిసి నటిస్తే పాత్రకు ప్రత్యేకత ఏర్పడుతుందని తమిళ భాష స్పష్టంగా ఉచ్చరించడాన్ని నేర్చుకున్నాను. మెడ్రాస్ చిత్ర విజయం నా కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యింది. ఆ తరువాత నటించిన కథకళి, కణిదన్ చిత్రాల్లో నాకు మంచి పాత్రలు లభించాయి. కొత్త చిత్రాలను అంగీకరించినప్పుడు కచ్చితంగా గ్లామరస్‌గా నటించే తీరాలని ఏ దర్శక, నిర్మాత నాపై ఒత్తిడి చేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్ విషయంలో ఒక్కో దర్శకుడికి ఒక్కోరకమైన దృష్టి ఉంటుంది. నా వరకూ నేను తెరపై అందంగా కనిపించాలని కోరుకుంటాను. నా శరీరాకృతికి నప్పేలా డ్రస్‌ను సెలెక్ట్ చేసుకుంటాను. కోలీవుడ్‌కు చాలా మంది కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఎవరికీ ఏది దక్కాలో అది దక్కుతుంది. నేనెవరికీ పోటీగా భావించడం లేదు. ఇతర హీరోయిన్ల నటననే పోటీగా తీసుకోవాలన్న నా భావన. -
విష్ణువిశాల్‌తో రొమాన్స్ కు రెడీనా?
విజయపథంలో పయనిస్తున్న యువ నటులలో విష్ణువిశాల్ ఒకరు. ఇటీవల నిర్మాతగానూ మారి వేలన్ను వందుట్టా వెళ్లకారన్ చిత్రంతో సక్సెస్ అయ్యారు. తాజాగా కథానాయకన్ పేరుతో చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా కధానాయకి. నవ దర్శకుడు మురుగానందం మెగాఫోన్ పట్టిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ముండాసిపట్టి చిత్రం ప్రేమ్ రామ్ దర్శకత్వంలో నూతన చిత్రంలో విష్ణువిశాల్ నటిస్తున్నారు. ఈ యువ నటుడు మరోసారి దర్శకుడు మురుగానందంకు అవకాశం కల్పించారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండో చిత్రాన్ని ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా అందాల రాశి హన్సికను ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ఒక నూతన చిత్రం చేస్తున్న హన్సిక విష్ణువిశాల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు సై అంటారా అన్నది వేచి చూడాల్సిందే. జయంరవితో ఈ బ్యూటీ జత కట్టిన బోగన్ చిత్రం ఈ నెల 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోందన్నది గమనార్హం.