
ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ-2(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)లో నటించేందుకు తాను సిద్ధమని యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా జీఎస్టీ-2లో నటిస్తానని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ఫాలోవర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ‘నటిస్తా.. కానీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాలి’ అని బదులిచ్చారు. అనంతరం మరో అభిమాని మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగారు. దానికి ఆమె ‘అవును.. ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.