విమర్శ మంచే చేసిందన్నమాట.. | Rashi Khanna React on Criticism | Sakshi
Sakshi News home page

విమర్శ మంచిదే!

Jul 25 2019 8:03 AM | Updated on Jul 25 2019 8:03 AM

Rashi Khanna React on Criticism - Sakshi

సినిమా: కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత మాదిరి విమర్శలు మంచినే చేస్తాయి. విమర్శలకు కృంగిపోయో, ఉక్రోష పడో ప్రతి విమర్శలకు దిగితే జరిగేది రచ్చే. అదేవిధంగా విమర్శ ఉదాసీనం చేయకుండా, దాన్ని చాలెంజ్‌గా తీసుకుంటే ఫలితం ఉంటుంది. నటి రాశీఖన్నా అదే చేసింది. ఈ హైదరాబాదీ అమ్మడు ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత విశాల్‌కు జంటగా అయోగ్య, జయంరవికి జంటగా అడంగుమరు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. హిట్‌ చిత్రాల హీరోయిన్‌గా వాసి కెక్కిన ఈ అమ్మడిప్పుడు విజయ్‌సేతపతి సరసన సంఘతమిళన్‌ చిత్రంతో పాటు కడైసీ వివసాయి అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. త్వరలో దళపతి విజయ్‌తో కూడా రొమాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సందర్భంగా ఈ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో ఈత దస్తుల్లో నటించింది.

అయితే కాస్త బొద్దుగా ఉండే రాశీఖన్నాను ఈత దుస్తుల్లో చూసిన ఒక ప్రేక్షకుడు రాశీ నీకీ ఈత దుస్తులు అవసరమా అని ప్రశ్నించాడట. దీంతో అతనిపై విరుచుకు పడకుండా, ఆ అభిమాని విమర్శను ఛాలెంజ్‌గా తీసుకుని కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైందట. దీని గురించి నటి రాశీఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాదు ప్రస్తుతం తను నటిస్తున్న తెలుగు చిత్రం వెంకీమామలో తన అందం చూడవయ్యా అని ఆ అభిమానికి బదులిచ్చిందట. ఈ చిత్రంలో చాలా చిక్కిన ఈ సక్కనమ్మ మరింత అందంగా కనిపిస్తుందట. అందుకు తగ్గట్టు ఆ చిత్రంలో చాలా మోడ్రన్‌ పాత్రలో నటించింది.  ఈ సందర్భంగా రాశీఖన్నా తెలుపుతూ రాత్రికి రాత్రి మార్పును ఆశించరాదని, తాను ఎప్పుడూ వర్కౌట్స్‌ చేస్తానని చెప్పింది. అలా రెండేళ్లు కసరత్తులు చేసిన తరువాతనే సన్నబడినట్లు తెలిపింది. సన్నబడ్డాను కదా అని వర్కౌట్స్‌ చేయడం నిలపలేదని, వారానికి ఆరు రోజులు కసరత్తులు చేస్తానని, అదే విధంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటానని చెప్పింది. అలా అభిమానులు చేసిన విమర్శలను చాలెంజ్‌గా తీసుకుని కసిగా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైన రాశీఖన్నాకు విమర్శ మంచే చేసిందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement