'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా' | Rashi Khanna didnt charge a penny for her special Song | Sakshi
Sakshi News home page

'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'

Sep 16 2017 2:14 PM | Updated on Sep 19 2017 4:39 PM

'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'

'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'

టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా.

టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించిన జై లవ కుశ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాశీ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఫాంలో ఉన్న హీరోయిన్లు ఎంత చిన్న క్యారెక్టర్లో నటించినా.. ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు.

అలాంటి రాశీ ఓ స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేసిందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాటలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట రాశీ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement