ప్రేమ.. వినోదం.. రణస్థలం

Ranasthalam movie first look launched - Sakshi

‘‘రణస్థలం’ సినిమాని మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను. రాజు చిన్న స్థాయి నుంచి ఈరోజు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై కావాలి రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

కావాలి రాజు మాట్లాడుతూ–‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘రణస్థలం’. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్‌ చివరి దశలో ఉంది. నవంబర్‌ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాకి కథే హీరో. మంచి కథతో చక్కటి అవుట్‌పుట్‌ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కర్నీ మా చిత్రం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’అన్నారు ఆది అరవల. చిత్ర సంగీత దర్శకుడు రాజకిరణ్, కెమెరామన్‌ ప్రభాకర్, పాటల రచయిత రామారావు, కో డైరెక్టర్‌ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top