15 తగ్గించేశారు! | Rana gave up proteins, weight training | Sakshi
Sakshi News home page

15 తగ్గించేశారు!

Jan 5 2018 1:07 AM | Updated on Aug 11 2019 12:52 PM

Rana gave up proteins, weight training - Sakshi

బందేవ్‌ను చూశారా? అదేనండీ... తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హాథీ మేరే సాథీ’ సినిమాలో హీరో రానా లుక్‌ గురించి చెబుతున్నాం. చాలా స్లిమ్‌ అయ్యారని అందరూ అంటున్నారు. అయితే... హౌ భల్లాలదేవ బగయా బందేవ్‌ (సినిమాలో రానా పాత్ర పేరు బందేవ్‌) అంటే.. ఇలా అని పేర్కొన్నారు రానా. ‘‘బాహుబలి’ తర్వాత నెక్ట్స్‌ నేను చేయబోయే సినిమాల్లోని క్యారెక్టర్స్‌ కోసం బరువు తగ్గాల్సిందే. అందుకే.. ఆ ప్రాసెస్‌ను స్లోగా అప్పుడే స్టార్ట్‌ చేశాను. ‘హాథీ మేరే సాథీ’ సినిమాలోని బందేవ్‌ లుక్‌ కోసం నేను ఆరు వారాలుగా నాన్‌ వెజ్‌ తినడం లేదు. ప్రొటీన్‌ ఫుడ్‌ను దూరం పెడుతున్నా. బరువు పెరిగే ఎక్సర్‌సైజ్‌లను ఆపేశాను. మజిల్స్‌ పెరిగే విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు రానా.

‘‘నాలుగేళ్లుగా రానా కొన్నిసార్లు బరువు పెరిగారు. మరికొన్నిసార్లు తగ్గారు. ఇందుకోసం స్ట్రిక్ట్‌ డైట్‌ను ఫాలో అవుతున్నారాయన. లేటెస్ట్‌ లుక్‌ కోసం రానా 15కేజీలు తగ్గారు. ఇదివరకు ఎవ్రీ టు అవర్స్‌కు రానా ఏదో ఒకటి తినేవారు. ఇప్పుడు నార్మల్‌గా ఎవ్రీడే మూడుసార్లు మాత్రమే తినేలా ప్లాన్‌ చేశాం’’ అన్నారు ట్రైనర్‌ కునాల్‌. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సగంతి ఇలా ఉంచితే... రానా, రెజీనా జంటగా సత్యశివ దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్‌ సినిమా ‘1945’. ఈ సినిమాను ఈ ఏడాది మేలో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement