మావూళ్లమ్మ చరిత్ర | ramya krishnan Title role new movie | Sakshi
Sakshi News home page

మావూళ్లమ్మ చరిత్ర

Oct 8 2015 11:06 PM | Updated on Sep 3 2017 10:39 AM

మావూళ్లమ్మ చరిత్ర

మావూళ్లమ్మ చరిత్ర

రమ్యకృష్ణ టైటిల్ రోల్‌లో నండూరి వీరేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జగన్మాత’. గజ్జవరపు మహిమా చౌదరి సమర్పణలో

రమ్యకృష్ణ టైటిల్ రోల్‌లో నండూరి వీరేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జగన్మాత’. గజ్జవరపు మహిమా చౌదరి సమర్పణలో ఎన్.ఎస్. రాజు, జె. వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పుష్పలీల పాటల సీడీని ఆవిష్కరించి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు అందించారు. ‘‘ఈ చిత్రానికి థియేటర్స్ విషయంలో ఏదైనా సమస్య వస్తే, చాంబర్ తరఫున పర్సంటేజీ విధానం ద్వారా థియేటర్లు ఇప్పిస్తాం’’ అని రామకృష్ణ గౌడ్ అన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలంటే ఆసక్తి అనీ, త్వరలో ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నానని పుష్పలీల చెప్పారు. నండూరి వీరేష్‌తో ‘బుల్లెట్ బాయ్’ అనే సినిమా తీశాననీ, ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. భీమవరం మావూళ్లమ్మ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీశారని మోహన్ గౌడ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement