చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ | Ramgopal Varma Comments on Bahubali, brucelee, Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ

Oct 17 2015 11:35 AM | Updated on Sep 3 2017 11:06 AM

చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ

చిరు బ్రూస్ లీ చేయడం 'ప్రజారాజ్యం' లాంటి తప్పే: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పాడు. నిన్నంతా( శుక్రవారం) బ్రూస్ లీ సినిమా మీద మాటల దాడి చేసిన వర్మ తాజాగా మెగాస్టార్ ను టార్గెట్ చేశాడు. బ్రూస్ లీ యూనిట్ చెప్పుతున్న...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పాడు. నిన్నంతా ( శుక్రవారం) బ్రూస్ లీ సినిమా మీద మాటల దాడి చేసిన వర్మ... తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. బ్రూస్ లీ యూనిట్ చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా, తను మాత్రం చిరంజీవిని 150వ సారి వెండితెర మీద చూశానని, ఇదే చిరు 150వ సినిమా అంటూ తేల్చేశాడు వర్మ. 150వ సినిమాగా బ్రూస్ లీ సినిమాను ఎంచుకోవడం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం లాంటి మెగా తప్పేనని వర్మ చెప్పాడు. అయితే ఆయన 151వ సినిమా మాత్రం ఎంటర్ ద డ్రాగన్ లాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానన్నాడు.

'చిరు 151వ సినిమాగా ఓ తమిళ రీమేక్ సినిమాను చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తమని భావిస్తున్నా, ఆ సినిమా బాహుబలిలా ఒరిజినల్ సినిమా అయి ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి ఎంత గొప్ప అన్నది విషయం కాదు, మెగాస్టార్ అన్నది అన్నింటికంటే పెద్ద విషయం, అందుకే తమిళ సినిమా రీమేక్ లో నటించి తెలుగు వారి గౌరవాన్ని దెబ్బతీయోద్దు, రాజమౌళిలా తెలుగు వారి గౌరవాన్ని మరింతగా పెంచాలి.

మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా.. చిరు 151వ సినిమాగా రీమేక్ సినిమాను చేయొద్దు, ఒరిజినల్ సినిమానే చేయాలి. అది కూడా బాహుబలిని మించే భారీ సినిమా చేయాలి. మిగతా మెగా అభిమానులు కూడా చిరంజీవి రీమేక్ సినిమా చేయొద్దని కోరాలి. చిరంజీవి లాంటి మెగాస్టార్ తమిళ కాపీ సినిమా చేయటం అనేది తెలుగు వారికి అవమానం, అందుకే చిరంజీవి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడన్న వార్త రూమర్ అనుకుంటున్నా'. అంటూ ట్వీట్ చేశాడు.

బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు వర్మ. ' బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. రాజమౌళి ఇండియన్ సినిమాకు రియల్ బ్రూస్ లీ. రాజమౌళి గారూ.. చాలా మంది బ్రూస్ లీలు తాకి గర్వపడటం కోసం మీ కాళ్ల ఫొటోను ట్వీట్ చేయండి' అంటూ కామెంట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement