'నా వంగవీటి రాధ ఇతనే' | ram gopal verma reveals vanga veeti radha charecter casting phots | Sakshi
Sakshi News home page

'నా వంగవీటి రాధ ఇతనే'

Feb 3 2016 4:28 PM | Updated on Sep 3 2017 4:53 PM

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ఇదివరకే తెలిపారు.

అయితే  ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు.

'వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు' అంటూ సిగరేట్ కాల్చే ఫోటోను..


'వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు'.. అని కాఫీ తాగుతున్న ఫోటోను..


కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్విట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement