నేను నయీంలకే నయీంని : వర్మ | Ram Gopal Varma Responds On threatening Calls from Nayeem Gang | Sakshi
Sakshi News home page

నేను నయీంలకే నయీంని : వర్మ

Sep 27 2016 10:28 AM | Updated on Oct 16 2018 9:08 PM

నేను నయీంలకే నయీంని : వర్మ - Sakshi

నేను నయీంలకే నయీంని : వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీస్తున్నాడు. ఇప్పటికే నిజజీవిత సంఘటన ఆధారంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ, ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన...

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీస్తున్నాడు. ఇప్పటికే నిజజీవిత సంఘటన ఆధారంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ, ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన నయీం జీవితం ఆధారంగా సినిమాను రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే నయీం జీవితంపై రిసెర్చ్ స్టార్ట్ చేసిన వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ.. ఇలాంటి కాల్స్కు భయపడేది లేదని.. తాను నయీం లకే నయీం నని తెలిపాడు. ప్రస్తుతం ముంబైలో నయీంతో పాటు జైల్లో ఉన్న వ్యక్తిని, నయీం కేసుకు సంబందించిన పోలీసు అధికారులను, నయీంతో కలిసి పని చేసిన ఇద్దరు నక్సలైట్లను కలిసినట్టుగా వెల్లడించాడు.

కరాచీలో ఉండే ఓ పెద్ద వ్యక్తితో నయీంకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని తెలిసి తాను షాక్ అయ్యానన్నాడు. నయీం కథతో తెరకెక్కుతున్న సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తన గత సినిమాల మాధిరిగానే తన వాయిస్ ఓవర్ తో నయీం టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement