‘నాకు లేని అభ్యంతరం వారికెందుకు?’

Rakul on Maxim Photo Shoot Criticism - Sakshi

సాక్షి, సినిమా : దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌లో ‘అయ్యారీ’తో ప్రేక్షకులను పలకరించబోతోంది రకుల్‌. ఈ క్రమంలో ఓవైపు హీరో సిధార్థ్‌ మల్హోత్రాతోపాటు చిత్ర ప్రమోషన్‌ ఈవెంట్లలో పాల్గొంది. మరోవైపు హాట్‌ ఫోటో షూట్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

అయితే సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్‌ ఒక్కసారిగా ‘అలా’ కనిపించేసరికి ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు. సోషల్‌ మీడియాలో అనుచిత కామెంట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రకుల్‌ స్పందించింది. వారికేమైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆమె మాంచి సమాధానమే ఇచ్చింది. 

‘ఆ ఫోటోషూట్‌పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్‌ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్‌ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు. కెరీర్‌లో ఒక్కసారైనా ప్రముఖ మాగ్జైన్‌ కవర్‌ పేజీలపై మెరవాలన్న కోరిక ప్రతీ నటీనటులకు ఉంటుంది. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా. అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు. నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్‌ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోనని ఆమె తెలిపింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందిస్తూ తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్‌ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్‌ వివరించింది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన అయ్యారీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సిధార్థ్‌ మల్హోత్రా, మనోజ్‌ బాజ్‌పాయి, రకుల్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top