‘నో’ చెప్పడం నేర్చుకున్నా! | Rakhi Sawant opens up about casting couch | Sakshi
Sakshi News home page

‘నో’ చెప్పడం నేర్చుకున్నా!

May 15 2018 1:53 AM | Updated on May 15 2018 1:53 AM

Rakhi Sawant opens up about casting couch - Sakshi

‘కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌లో నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఫేస్‌ చేశాను’ అంటున్నారు బాలీవుడ్‌ హాట్‌ యాక్టర్‌ రాఖీ సావంత్‌. క్యాస్టింగ్‌ కౌచ్‌ ప్రస్తుతం ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో హాట్‌ టాపిక్‌. ఈ విషయం గురించి రాఖీ సావంత్‌ మాట్లాడుతూ –‘‘కెరీర్‌ స్ట్రగ్లింగ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నాను. అలా అని అందరు దర్శకులు, నిర్మాతలను తప్పుపట్టడం లేదు. కేవలం కొందరిని మాత్రమే.

అవును.. ఇండస్ట్రీలో సెక్సువల్‌ కరప్షన్‌ ఉంది. అయినా.. ఎక్కడ లేదని? నేను నా ట్యాలెంట్‌ని నమ్ముకున్నాను. అందుకే ఎక్కడా లొంగిపోలేదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకోవడానికి నా ట్యాలెంట్‌ను ఉపయోగించుకున్నాను. స్ట్రగ్లింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఆర్టిస్ట్‌లందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఓపికగా ఉండండి. షార్ట్‌కట్స్‌కు టెంప్ట్‌ అవ్వకండి’’ అని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement