
తెలుగులో సూపర్ స్టార్ అతడే: రజనీకాంత్
భాషతో సంబంధం లేకుండా 'సూపర్ స్టార్' అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రజనీకాంత్. రజనీ స్టైల్, నటనతోపాటు వ్యక్తిత్వం అభిమానుల మనసుల్లో ఆయన్ను సూపర్ స్టార్గా నిలిపాయి.
భాషతో సంబంధం లేకుండా 'సూపర్ స్టార్' అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రజనీకాంత్. రజనీ స్టైల్, నటనతోపాటు వ్యక్తిత్వం అభిమానుల మనసుల్లో ఆయన్ను సూపర్ స్టార్గా నిలిపాయి. అయితే తలైవా కొన్నేళ్ల ముందే తెలుగులో రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ ఎవరనేది అంచనా వేసేశారట. ఈ ఆసక్తికర విషయాన్ని నటుడు సునీల్ ఈ మధ్యనే బయటపెట్టాడు.
రజనీ 'కథానాయకుడు' సినిమా షూటింగ్ లో ఉండగా అక్కడే ఉన్న సునీల్.. పవన్ కల్యాణ్ 'జల్సా' సినిమా పోస్టర్ ను చూస్తూ కూర్చున్నాడట. అదే సమయంలో జల్సా పోస్టర్ ను గమనించిన రజనీ 'తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ పవన్ కల్యాణే' అన్నారట. పవన్ కల్యాణ్ తెలుగులో సూపర్ స్టార్ అవుతాడంటూ రజనీ చెప్పిన మాటలను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సునీల్ గుర్తుచేసుకున్నాడు.
ఒక్క పోస్టర్ తోనే పవన్ క్రేజ్ ను పట్టేశారు సూపర్ స్టార్. నిజంగానే పవన్ ఇప్పుడో ప్రభంజనం. అదేమాట అంటున్నాడు 'కృష్ణాష్టమి' హీరో సునీల్. కృష్ణాష్టమి కథ విషయంలో డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపుతున్నాడు సునీల్.