తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్ | Rajini, Shankars 2.0 teaser for Tamil New Year | Sakshi
Sakshi News home page

తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్

Jan 27 2017 1:48 PM | Updated on Sep 5 2017 2:16 AM

తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్

తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్

గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 2.0.

గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్గా టీజర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేసింది రోబో టీం. తమిళ సంవత్సారాది సందర్భంగా ఏప్రిల్ 14న 2.0 టీజర్ను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement