సూపర్ స్టార్ల కలయిక | Rajini Kanth Meets Kamal Haasan | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ల కలయిక

Nov 16 2016 11:01 AM | Updated on Sep 4 2017 8:15 PM

సూపర్ స్టార్ల కలయిక

సూపర్ స్టార్ల కలయిక

తమిళ నాట తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్. రజనీకాంత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటే, కమల్ మాత్రం విలక్షణ పాత్రలతో అదే స్థాయిలో...

తమిళ నాట తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్. రజనీకాంత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటే, కమల్ మాత్రం విలక్షణ పాత్రలతో అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే అదే స్నేహ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఎవరి సినిమాలతో వారు బిజీ కావటంతో ఈ ఇద్దరు కలిసి కనిపించలేదు.

అయితే చాలా కాలం తరువాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపించారు. తన ఇంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడి రెస్ట్ తీసుకుంటున్న కమల్ హాసన్ పరామర్శించేందుకు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఇంటికి వెళ్లారు. కొంత కాలంగా రజనీ ఆరోగ్యం కూడా బాగోలేదన్న వార్తలు వస్తుండటంతో ఇద్దరు హీరోలు ఒకరినొకరు పరామర్శించుకున్నారట. ఈ భేటికి సంబంధించిన విషయాలను రజనీ, కమల్లు వెల్లడించకపోయినా.. ఇద్దరు కలిసిన సమయంలో కమల్ సహాయకుడు రాజేష్ ఎం సెల్వా వారిద్దరితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేయటంతో, కోలీవుడ్ లో సూపర్ స్టార్ల కలయిక హాట్ టాపిక్ గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement