రిచ్.. స్టైలిష్.. గరుడవేగ | rajasekhar Garudavega teaser | Sakshi
Sakshi News home page

రిచ్.. స్టైలిష్.. గరుడవేగ

Sep 22 2017 5:31 PM | Updated on Aug 13 2018 3:04 PM

రిచ్.. స్టైలిష్.. గరుడవేగ - Sakshi

రిచ్.. స్టైలిష్.. గరుడవేగ

సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ  సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా గరుడవేగ టీజర్ పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఒకేసారి విడుల చేశారు. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement