... టు టాలీవుడ్‌

Rajaratha poster release - Sakshi

‘రంగితరంగ’ అనే కన్నడ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న నిరూప్‌ భండారి ‘రాజరథం’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ముంబయ్‌ బ్యూటీ అవంతికా శెట్టి హీరోయిన్‌. తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనూప్‌ భండారి దర్శకత్వంలో అజయ్‌రెడ్డి గొల్లపల్లి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌ శాస్త్రి తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజరథం’ చిత్రంలోని నిరూప్‌ లుక్‌ని చిత్రబృందం రిలీజ్‌ చేసింది.

అనూప్‌ భండారి మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ కామెడీ మూవీ ఇది. నిరూప్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తారు. కొన్ని రిస్కీ ఫైట్స్‌ను డూప్‌ లేకుండా చేశారు. ఆ సమయంలో చేతికి గాయాలవడంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ సూచించారు. అందువల్ల టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ పాటను జానీ మాస్టర్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాం. ఈ సినిమాలోని అన్ని మెలోడీ, ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌ని అనూప్‌ భండారి కంపోజ్‌ చేయడం విశేషం. రామజోగయ్యశాస్త్రి పాటలు, అబ్బూరి రవి మాటలు రాశారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ సాజ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top