పైవేవీ కాదు | Rajamouli's RRR based on rebirth? Producer Danayya clarifies | Sakshi
Sakshi News home page

పైవేవీ కాదు

Jun 8 2018 12:06 AM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli's RRR based on rebirth? Producer Danayya clarifies - Sakshi

రామ్‌ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్‌

చూజ్‌ ది కరెక్ట్‌ ఆన్సర్స్‌లో.. సరైన ఆన్సర్‌ ఇవ్వకుండా ఒక్కోసారి ‘పైవేవీ కాదు’ అని ఇస్తుంటారు. సరైన సమాధానం లేనప్పుడు మనం దానికే టిక్‌ పెడతాం. అన్నదమ్ముల్లా అన్యోన్యంగా కనిపిస్తారట. లేదు.. లేదు బాక్సింగ్స్‌ రింగ్‌లో బరిలోకి దిగుతారట. అసలివేంకాదు రాజమౌళి ఫేవరెట్‌ సబ్జెక్ట్‌.. ‘పునర్జన్మల కాన్సెప్ట్‌’లో సినిమా ఉంటుందట. ఇలా రోజూ ఏదో ఓ వార్తను గాసిప్‌రాయుళ్లు స్టోరీగా అల్లేస్తున్నారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించినంత వరకూ ‘పైవేవీ కావు’ అనే సమాధానమే ప్రస్తుతానికి ఆప్షన్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య ఓ భారీ మల్టీస్టారర్‌ మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్‌ చేసిన రోజు నుంచి స్టోరీ లైన్‌ ఇదంటూ ఏదో గాసిప్‌ వినిపిస్తూనే ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి న్యారేషన్‌ ఇంకా ఎన్టీఆర్, చరణ్‌కు రాజమౌళి వినిపించలేదని సమాచారం. కేవలం లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన లుక్‌ టెస్ట్‌ మినహా సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ బయటకు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాతో, చరణ్‌ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ హీరోలిద్దరూ తమ ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ చేసి అక్టోబర్, నవంబర్‌ కల్లా రాజమౌళి సినిమా ప్రపంచంలోకి అడుగుపెడతారట. సినిమా బడ్జెట్‌ సుమారు 300 కోట్లుంటుందని సమాచారం. 2020 సమ్మర్‌కు రిలీజ్‌ అవుతుందట. స్టోరీ లైన్‌ ఏదైనా కానీ ఒకే విల్లుతో ఎన్టీఆర్, చరణ్‌ అనే రెండు బాణాలను బాక్సాఫీస్‌పై వదలనున్న రాజమౌళి విజన్‌ గురి తప్పదని ఊహిం^è వచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement