అన్నయ్యతో కలిసి...

radhika, ,mr radha ravi re entry - Sakshi

తమిళనాట ఎంతో పాపులారిటీ సంపాదించిన నటుడు, రాజకీయ నాయకుడు ఎం.ఆర్‌. రాధా. ఆయన వారసుడు రాధారవి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక రాధిక అప్పట్లో కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్‌ నటిగా, నిర్మాతగా సంపాదించుకున్న పేరు గురించి తెలిసిందే. 1980లలో ఎన్నో సినిమాల్లో ఈ అన్నాచెల్లెళ్లు ఆన్‌ స్క్రీన్‌ కూడా అన్నాచెల్లెళ్లుగా నటించారు. లేటెస్ట్‌గా ఓ తమిళ సినిమా కోసం ఈ ఇద్దరూ మళ్లీ స్క్రీన్‌పై బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌గా కనిపించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అధర్వ మురళీ హీరోగా శ్రీ గణేష్‌ తెరకెక్కించనున్న ‘కురుది అట్టమ్‌’లో రాధిక, రాధారవి చాలా గ్యాప్‌ తర్వాత కలిసి యాక్ట్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూ – ‘‘రాధిక, రాధారవి మా సినిమాకు కచ్చితంగా స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతారు. ఆ క్యారెక్టర్స్‌ రాసుకున్నప్పటి నుంచీ వీళ్లను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేదు. ఇద్దరికీ నా కథ నచ్చి ఒప్పుకోవడం నాకు చాలా గ్రేట్‌ మూమెంట్‌’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top