భయం తెచ్చిన మార్పు..! | RACHAYITA movie firstlook release | Sakshi
Sakshi News home page

భయం తెచ్చిన మార్పు..!

Nov 11 2017 1:01 AM | Updated on Nov 11 2017 6:03 AM

RACHAYITA movie firstlook release - Sakshi

భయానికి భాష లేదు. ఏదొక సిచ్యువేషన్‌లో ఎవరైనా భయపడాల్సిందే. అలాంటి భయం ఒక మనిషి జీవితాన్ని కంప్లీట్‌గా మార్చి వేసింది. అతనెందుకు భయపడ్డాడు? ఆ భయం అతనిలో తెచ్చిన మార్పు ఏంటి? అన్న విషయాల నేపథ్యంలో ‘రచయిత’ అనే సినిమా రూపొందుతోంది. హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో విద్యాసాగర్‌ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను దుహర మూవీస్‌ పతాకంపై కల్యాణ్‌ ధూలిపల్ల నిర్మించారు. సంచితా పదుకొనె కథానాయిక. సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు.

త్వరలో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. నిర్మాత కల్యాణ్‌ ధూలిపల్ల మాట్లాడుతూ–‘‘1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగే థ్రిల్లింగ్‌ లవ్‌స్టోరీ చిత్రమిది. పీరియాడికల్‌ మూవీ కావడంతో బడ్జెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. ఈ సినిమాతో డైరెక్టర్‌ కమ్‌ హీరో విద్యాసాగర్‌ రాజు ప్రేక్షకులను మెప్పిస్తాడు. మా సినిమాకి ఒక స్టార్‌ నటుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఒక సినిమాకి బ్రాండ్‌షిప్‌ చేయడం అనేది ఇదే మొదటిసారి’’ అన్నారు. శ్రీధర్‌ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: షాన్‌ రెహమాన్, కెమెరా: సాయి శ్రీరామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement