వెంకీతో పూరి? | Puri Jagannath To Direct Venkatesh | Sakshi
Sakshi News home page

వెంకీతో పూరి?

Dec 28 2016 12:09 AM | Updated on Mar 22 2019 1:53 PM

వెంకీతో పూరి? - Sakshi

వెంకీతో పూరి?

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు.

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. హిందీ ‘సాలా ఖడూస్‌’కు రీమేక్‌గా సుధ కొంగర దర్శకత్వంలో వెంకీ నటించిన తాజా చిత్రం ‘గురు’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకొంటోంది. జనవరి 26న ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ‘గురు’ తర్వాత వెంకీ ‘నేను – శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళూ.. మీకు జోహార్లు’ చిత్రం చేయనున్నారనే టాక్‌ వినిపించింది. తాజాగా వెంకటేశ్‌తో పూరి జగన్నాథ్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. కల్యాణ్‌రామ్‌తో తీసిన ‘ఇజం’ విడుదలై రెండు నెలలు దాటినా తర్వాతి చిత్రం ఏమిటనే విషయంపై పూరి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. మరి.. వెంకీతో సినిమా చేయనున్నారనే వార్త గురించి త్వరలో క్లారిటీ వస్తుందా?

Advertisement
 
Advertisement
Advertisement