ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు | Priyanka Chopra wins for 'Quantico' at People's Choice Awards | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు

Jan 7 2016 10:45 AM | Updated on Sep 3 2017 3:16 PM

ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు

ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు

హాలీవుడ్ టివి సీరిస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంక చోప్రా మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఈ టివి సీరీస్ అత్యంత ప్రజాధరణ కలిగిన టివి షోగా...

హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా మరో అరుదైన ఘనత సాధించింది.  ఇప్పటికే ఈ టీవీ సిరీస్ అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ షోగా రికార్డ్ సృష్టిస్తుండగా, అందులో లీడ్ రోల్లో నటించిన ప్రియాంక నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాంటికో టీవీ సిరీస్తో మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియాంక. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2016కు ప్రియాంక చోప్రా ఎంపికైంది.

ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించే ఈ కాంపిటీషన్లో హాలీవుడ్ స్టార్స్ ఎమ్మా రోబర్ట్స్, లీ మిచెల్, మార్షియాగే హార్డన్ లాంటి స్టార్స్ను  వెనక్కి నెట్టి ప్రియాంక అవార్డ్ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకోవటంతో పాటు, ప్రియాంక నటించిన క్వాంటికో హాలీవుడ్లో ఘనవిజయం సాధించటంతో ఈ హాట్ బ్యూటీని పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ వరించింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. అవార్డుతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ తనకు ఓటు చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement