breaking news
Peoples Choice Awards
-
ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు
హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఈ టీవీ సిరీస్ అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ షోగా రికార్డ్ సృష్టిస్తుండగా, అందులో లీడ్ రోల్లో నటించిన ప్రియాంక నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాంటికో టీవీ సిరీస్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియాంక. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2016కు ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించే ఈ కాంపిటీషన్లో హాలీవుడ్ స్టార్స్ ఎమ్మా రోబర్ట్స్, లీ మిచెల్, మార్షియాగే హార్డన్ లాంటి స్టార్స్‌ను వెనక్కి నెట్టి ప్రియాంక అవార్డ్ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకోవటంతో పాటు, ప్రియాంక నటించిన క్వాంటికో హాలీవుడ్లో ఘనవిజయం సాధించటంతో ఈ హాట్ బ్యూటీని పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ వరించింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. అవార్డుతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ తనకు ఓటు చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసింది. I am so fortunate!Thank U to everyone who voted for me at the #PCAs! My #PCManiacs-I am nothing without you!Big love pic.twitter.com/Omg31wG7oa — PRIYANKA (@priyankachopra) January 7, 2016 -
హోస్ట్ డిజైనర్!
టీవీ షో పాపులర్ హోస్ట్ ఎలెన్ డిజనరస్ కొత్త అవతారమెత్తింది. డిజైనర్‌గా మారి తన డ్రెస్‌ను తనే డిజైన్ చేసుకుంది. ఈ ఏడాది పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌కు విభిన్నమైన క్రీమ్ కలర్ ట్రాక్‌సూట్.. దానిపై సెయింట్ లారెంట్ షర్ట్ ధరించి వచ్చిన ఈ భామ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇది నేనే డిజైన్ చేశా. ఎంటర్ప్రెన్యూర్ క్రిస్ బర్చ్తో కలసి ఓ ఫ్యాషన్ వెంచర్ ప్లాన్ చేశా. త్వరలోనే లాంచ్ చేస్తాం. నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది’ అని ఎలెన్ చెప్పింది. ఈ రీటైల్ ఫ్యాషన్ చైన్‌కు మాస్టర్ మైండ్ సి.వండర్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ టోరీ బర్చ్. డిజనరస్ బ్రాండ్‌కు ‘ఈడీ’గా పేరు పెట్టారు. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.