త్వరలో... టాక్ షోలో ప్రియాంక | Priyanka Chopra to Host an American Celebrity Talk Show | Sakshi
Sakshi News home page

త్వరలో... టాక్ షోలో ప్రియాంక

Oct 27 2015 10:37 PM | Updated on Sep 3 2017 11:34 AM

త్వరలో... టాక్ షోలో ప్రియాంక

త్వరలో... టాక్ షోలో ప్రియాంక

ప్రియాంకా చోప్రా పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతోంది. అమెరికాలోని టెలివిజన్ నెట్‌వర్క్ ‘ఏ.బి.సి’లో...

ప్రియాంకా చోప్రా పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతోంది. అమెరికాలోని టెలివిజన్ నెట్‌వర్క్ ‘ఏ.బి.సి’లో ఇటీవలే మొదలైన ఇంటర్నేషనల్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో ఆమె పోషిస్తున్న పాత్ర ఒక్కసారిగా విదేశాల్లోనూ విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకు’ అన్నట్లుగా తాజా ‘క్వాంటికో’ ఎఫెక్ట్‌తో ఈ మాజీ ప్రపంచ సుందరికి మరో ఇంటర్నేషనల్ ఆఫర్ తాజాగా వచ్చింది. ‘క్వాంటికో’ను నిర్మిస్తున్న ‘ఏ.బి.సి’ నిర్మాణ సంస్థే ఆమెతో ఒక కొత్త ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఏ.బి.సి’ చేసే ఒక సెలబ్రిటీ టాక్‌షోకు ప్రియాంకా చోప్రా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆ టాక్ షో పనులు మొదలు కానున్నాయి.  ఒకపక్క ‘బాజీరావ్ మస్తానీ’ లాంటి హిందీ చిత్రాల్లో పాత్రలతో బిజీగా ఉన్న ప్రియాంక ఈ సరికొత్త ఆఫర్‌ను ఆనందంగా ఒప్పుకున్నట్లు సమాచారం. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో అమెరికన్ గూఢచారి సంస్థ ‘ఎఫ్.బి.ఐ’ ఏజెంట్‌గా నటిస్తున్న ప్రియాంక తనకు విదేశాల్లో లభిస్తున్న ఆదరణ చూసి, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందుగా ఈ టీవీ సిరీస్‌లో ‘ఒకటో సీజన్’ను 13 భాగాలతో ముగించాలని అనుకున్నారు.

తీరా, వీక్షకుల నుంచి వస్తున్న భారీ స్పందన చూసి, మరో ఆరు భాగాలు పొడిగించాలని తీర్మానించారు. అంటే, మొత్తం 19 భాగాలుగా ‘క్వాంటికో’ అలరిస్తుందన్న మాట.  ప్రతి ఆదివారం అమెరికాలోని టీవీలో ప్రసారమవుతున్న ‘క్వాంటికో’ సిరీస్ కోసం ఆమె దాదాపు 6 నెలల టైమ్ కేటాయించారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం న్యూయార్క్, మాంట్రియల్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

డిసెంబర్ కల్లా మన దేశానికి తిరిగి రానున్న 33 ఏళ్ళ ఈ వెండితెర బాక్సింగ్ రాణి ఆ వెంటనే ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా ప్రచారంలో, ‘జై గంగాజల్’ సినిమా చిత్రీకరణ, ప్రమోషన్‌లో బిజీ కానున్నారు. ‘‘ఎంత బిజీగా ఉన్నా, ఎలాగోలా డేట్స్ సర్దుబాటు చేసుకొని, ఈ కొత్త సెలబ్రిటీ టాక్ షో కూడా చేయాలని ప్రియాంకా చోప్రా భావిస్తున్నారు’’ అని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిం చాయి. ఇంకేం మరో లక్కీఛాన్స్ అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement