'అయ్యో అమెరికా కాదు.. నా ఇల్లు ముంబై' | Priyanka Chopra denies rumours of relocating to LA | Sakshi
Sakshi News home page

'అయ్యో అమెరికా కాదు.. నా ఇల్లు ముంబై'

Aug 31 2016 1:56 PM | Updated on Apr 3 2019 6:34 PM

'అయ్యో అమెరికా కాదు.. నా ఇల్లు ముంబై' - Sakshi

'అయ్యో అమెరికా కాదు.. నా ఇల్లు ముంబై'

ఎప్పటికీ తన ఇళ్లు ముంబయేనని ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుతం హాలీవుడ్లో సైతం బిజీ అయిన ప్రియాంక చోప్రా చెప్పింది.

ముంబయి: ఎప్పటికీ తన ఇళ్లు ముంబయేనని ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుతం హాలీవుడ్లో సైతం బిజీ అయిన ప్రియాంక చోప్రా చెప్పింది. తాను లాస్ ఎంజెల్స్లో స్థిరపడతానని వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. యాక్టింగ్ కెరీర్ కోసం పశ్చిమ దేశాలకు వెళ్లడం సరైన నిర్ణయం అని చెప్పింది.

ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న ప్రియాంక చోప్రా అక్కడ అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటిస్తోంది. అయితే, ఆమె త్వరలోనే ముంబయి నుంచి మకాం ఎత్తేస్తారని, లాస్ ఎంజెల్స్ లో స్థిరపడబోతోందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 'కొన్ని వార్తలు వింటే నాకు నిజంగా ఆశ్చర్యంగా, హాస్యాస్పందంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి విషయాల్లో కచ్చితంగా వివరణ ఇవ్వాలి. ప్రస్తుతం న్యూయార్క్లో క్వాంటికో షూటింగ్ లో ఉన్న.. నా ఇళ్లు ముంబయి.. లాస్ ఎంజెల్స్ కాదు' అని ట్విట్టర్లో ప్రియాంక బదులిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement