లాస్‌ఏంజెల్స్ టు మియామీ! | Priyanka Chopra dazzles at Oscars party after stunning in white at red carpet | Sakshi
Sakshi News home page

లాస్‌ఏంజెల్స్ టు మియామీ!

Mar 2 2016 1:00 AM | Updated on Sep 3 2017 6:46 PM

లాస్‌ఏంజెల్స్ టు మియామీ!

లాస్‌ఏంజెల్స్ టు మియామీ!

ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో ప్రెజెంటర్‌గా లాస్ ఏంజెల్స్‌లో తెల్లటి గౌనులో సందడి చేసి, అదరగొట్టిన భారతీయ నటి ప్రియాంకా చోప్రా

 ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో  ప్రెజెంటర్‌గా లాస్ ఏంజెల్స్‌లో తెల్లటి గౌనులో సందడి చేసి, అదరగొట్టిన భారతీయ నటి ప్రియాంకా చోప్రా తన లొకేషన్ ను మియామీకి షిఫ్ట్ చేసేసి, ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా బిజీ అయిపోయారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్ తర్వాత ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హాలీవుడ్ చిత్రం - ‘బే వాచ్’.
 
  చాన్నాళ్ల కిత్రం వచ్చిన ‘బే వాచ్’ అనే టీవీ సిరీస్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక ‘బే వాచ్ గుడీస్’ అంటూ ఆ పాత్ర కోసం వాడుతున్న వస్తువుల్ని చూపెట్టారు. చెప్పులు, టవల్ - ఇలా ఇతర వస్తువులతో ఉన్న బకెట్ ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘అందరం బీచ్‌లో ఉన్నాం. షూటింగ్ మొదటిరోజు ఇది. యూనిట్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement