ప్రియాంక పెళ్లి అతనితోనేనా...

Priyanka Chopra And Nick Jonas Attend A Family Wedding Together - Sakshi

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్త నెట్టింట్లో కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నిక్‌ జోనాస్‌ బంధువు పెళ్లికి ఇరువురూ వెళ్లి, చేతులు జోడించి నడవడం పుకార్లకు మరింత బలం చేకూర్చుతున్నాయి. పెళ్లిలోకూడా నిక్‌ కుటుంబ సభ్యులతో ప్రియాంక చనువుగా ఉన్నారు. ఇద్దరూ చేతులు జోడించి కొత్త జంటలా పెళ్లికి హాజరయ్యారు.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆ ఫోటోలు వైరల్‌  అయ్యాయి. దీంతో ప్రియాంక వివాహం నిక్‌తోనే అవుతుందని సోషల్‌ మీడియాలో మారుమోగుతుంది. వారి ప్రేమ వ్యవహారన్ని బహిరంగంగా ప్రకటించనప్పటికీ ఆ జంట చూడముచ్చటగా ఉందని ప్రియాంక సన్నిహితులు ఒకరు అన్నారు. 

కాగా గతంలో ప్రియాంక, నిక్‌ కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్లాయి. 2017లో రెడ్‌ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. జిమ్మి కిమ్మెల్‌ షోలో దీనిపై ఎదురైన ప్రశ్నకు ప్రియాంక.. ఇద్దరం రాల్ఫ్‌ లారెన్‌ డ్రెస్‌లను వేసుకున్నాం. అందుకే అలా ఫొటోలకు పోజిచ్చాం అని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top