పెళ్లికి సిద్ధమైన ప్రియమణి | Priyamani ready to marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి సిద్ధమైన ప్రియమణి

Oct 31 2013 4:27 AM | Updated on Aug 28 2018 4:30 PM

పెళ్లికి సిద్ధమైన ప్రియమణి - Sakshi

పెళ్లికి సిద్ధమైన ప్రియమణి

ప్రియమణి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళని పాత్రలో జీవించిన నటి ప్రియమణి. తర్వాత మలైకోటై తదితర చిత్రాలలో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు.

ప్రియమణి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళని పాత్రలో జీవించిన నటి ప్రియమణి. తర్వాత మలైకోటై తదితర చిత్రాలలో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడ ప్రారంభంలో విజయాలు పలకరించాయి. తర్వాత అవకాశాలు ముఖం చాటేశాయి. మలయాళం, కన్నడంలోనూ అమ్మడి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. 
 
అదే సమయంలో ప్రియమణి వయసు ఇరవై తొమ్మిదికి చేరింది. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.  ప్రస్తుతం వరుడి అన్వేషణలో వారు బిజీగా ఉన్నారట. డాక్టర్, ఇంజినీరు, వ్యాపారవేత్తలలో ఒకరిని ప్రియమణి జీవిత భాగస్వామి చేయాలని ఆశిస్తున్నారని తెలిసింది. అంతేకాదు అలాంటి వారి జాతకాలను తెప్పించుకుని చూస్తున్నా రు. సరైన వరుడు లభించగానే ప్రియమణి పెళ్లిపీట లెక్కడం ఖాయమంటున్నారు. వివాహానంతరం నటనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రియమణి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement