ప్రియతో జోడీ కడుతున్న యువహీరో!

Priya Bhavani Shankar next film is with Hero Atharvaa - Sakshi

సాక్షి, తమిళసినిమా: ఒకవైపు సీనియర్‌ తారలు తెరమరుగవుతుంటే, కొత్త భామలు సత్తా చాటుతున్నారు. కోలీవుడ్‌లో యువ నటీమణుల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకి తాజాగా వర్ధమాన నటి ప్రియాభవానీశంకర్‌ చేరారు. ఆమెను వరుసగా విజయాలతోపాటు అవకాశాలు పలుకరిస్తున్నాయి.  బుల్లితెర ద్వారా వెండితెరకు ప్రమోట్‌ అయిన ఈ బ్యూటీకి రోజురోజుకు క్రేజ్‌ పెరుగుతోంది. ‘మేయాదమాన్‌’ తో వెండితెరకు పరిచయమైన ప్రియ భవానీశంకర్‌.. ఆ చిత్రం విజయవంతం కావడంతో కోలీవుడ్‌లో అందరి దృష్టిలో పడ్డారు. ఆ తరువాత హీరో కార్తీకి జోడీగా నటించిన ‘కడైకుట్టిసింగం’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. దీంతో ప్రియకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను ఆమె సొంతం చేసుకున్నారు.

‘కురుధి ఆట్టం’ చిత్రం కోసం వీరు జోడీ కట్టబోతున్నారు. దీనికి శ్రీగణేశ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయనకిది రెండో సినిమా. అందరూ కొత్తవారితో శ్రీగణేశ్‌ తెరకెక్కించిన ‘8 తొట్టాగళ్‌’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మధురై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా గ్యాఫ్‌ తరువాత నటుడు రాధారవి, ఆయన సోదరి, నటి రాధికాశరత్‌కుమార్‌ నటించబోతున్నారు. రాక్‌ ఫోర్ట్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ అధినేత టీ మురగానందం, బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ ఐబీ కార్తీకేయన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top