పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే... | premji about his music tunes | Sakshi
Sakshi News home page

పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...

Nov 16 2016 3:07 AM | Updated on Sep 4 2017 8:10 PM

పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...

పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...

ఇసైజ్ఞానిలా ట్యూన్లు కట్టలేను కావాలంటే ఆయనలా డ్రస్ ధరించగలను అని చెప్పానని నటుడు, సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ పేర్కొన్నారు.

ఇసైజ్ఞానిలా ట్యూన్లు కట్టలేను కావాలంటే ఆయనలా డ్రస్ ధరించగలను అని చెప్పానని నటుడు, సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ట్రిపుల్ వి.రాకార్‌డ్‌‌స పతాకంపై ఇంతకు ముందు ఎన్నమో నడక్కుదు వంటి విజ యవంతమైన చిత్రాన్ని అందించిన వీవీ.వినోద్‌కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం అచ్చమిండ్రి. విజయ్‌వసంత్,సృష్టిడాంగే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాధారవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ విజయ్‌వసంత్ హీరోగా వినోద్‌కుమార్ చిత్రం నిర్మించనున్నారని చెప్పగానే దానికి తానే సంగీతదర్శకుడినని అన్నానన్నారు.అందుకు వారూ అంగీకరించారని తెలిపారు.అంతే కాదు ఇకపై వారు రూపొందించే చిత్రాలు తానే సంగీతదర్శకుడినని, ఇది మాటలతో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పారు. ఇకపోతే తాను తన పెద్దనాన్న(ఇళయరాజా) పాటల ట్యూన్‌‌సను కాపీ కొడుతున్నానని చాలా మంది అంటున్నారన్నారు. నిజమే తాను తన పెద్దనాన్న ట్యూన్‌‌సనే మార్చి రూపొందిస్తున్నానని ఒప్పుకుంటున్నానన్నారు. ఇసైజ్ఞాని సంగీతాన్ని అందరూ కాపీ కొడుతున్నారని, అలాంటిది తమ సొత్తు అరుున ఆయన సంగీతాన్ని తాను కాపీ కొట్టకూడదా?అంటూ ప్రశ్నించారు.

తన దర్శక నిర్మాతలు ఇళయరాజా ట్యూన్‌‌సలా హారుుగా ఉండే పాటలను రూపొందించమని అడుగుతున్నారని, ఆయనలా సంగీతాన్ని అందించడం తన వల్లకాదు. కావలంటే ఆయనలా డ్రస్ ధరించగలనని చెప్పేవాడినని అన్నారు. అన్నట్టుగానే ఒక రోజు పెద్దనాన్నలా జుబ్బా, పంచె కట్టి, మెడలో రుద్రాక్షమాల ధరించి, హార్మోనియం చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చానని తెలిపారు. వాటిని పోస్టర్‌గా ముద్రించి వాడవాడలా అంటించారని తెలిపారు.అలా పెద్దనాన్న ఇంటి గోడలకు అంటించడంతో అవి చూసిన ఆయన తనను పిలిచి ఏరా తనలా ఫోజులిచ్చి ఎగతాళి చేస్తున్నావా? అని అడిగారన్నారు. అందుకు తాను అదికాదు పెద్దనాన్నా మీ ట్యూన్‌‌సలా తనను కట్టమన్నారని, అలా తన వల్లకాదు కావాలంటే మీలా దుస్తులు ధరించి ఫొటో ఫోజులివ్వగలనని చెప్పానని తెలిపారు. వసంత్‌కుమార్, సంగీతదర్శకుడు యువన్‌రాజా, వెంకట్‌ప్రభు, చిత్ర హీరో విజయ్‌వసంత్, సృష్టిడాంగే, చిత్రనిర్మాత వినోద్‌కుమార్, దర్శకుడు రాజపాండే, ఆర్‌కే.సెల్వమణి, పొన్‌వన్నన్, రోహిణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement