ప్రేమంటే... అంత ఈజీ కాదు | premante suluvu kadura audio release | Sakshi
Sakshi News home page

ప్రేమంటే... అంత ఈజీ కాదు

Dec 8 2015 12:01 AM | Updated on Sep 3 2017 1:38 PM

ప్రేమంటే... అంత ఈజీ కాదు

ప్రేమంటే... అంత ఈజీ కాదు

పవన్ కల్యాణ్ ‘ఖుషి’ చిత్రంలోని ‘ప్రేమంటే సులువు కాదురా..’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే.

పవన్ కల్యాణ్  ‘ఖుషి’ చిత్రంలోని ‘ప్రేమంటే సులువు కాదురా..’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో రూపొందుతున్న ప్రేమకథా  చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’.  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, సిమ్మిదాస్ జంటగా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నందన్‌రాజ్  స్వరపరిచిన  పాటలను సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు.  

రాజీవ్ మంచి విజయాలు సాధించి, పెద్ద హీరో కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement