ల్యాబ్‌లో మురిగిపోయే సినిమా అన్నారు! | Prema Antha Easy Kadhu Teaser launch | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌లో మురిగిపోయే సినిమా అన్నారు!

Mar 26 2019 2:09 AM | Updated on Mar 26 2019 2:09 AM

Prema Antha Easy Kadhu Teaser launch - Sakshi

రాజేష్‌కుమార్, ప్రజ్వాల్‌

రాజేష్‌కుమార్, ప్రజ్వాల్‌ జంటగా ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి.నరేష్, టి. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని చిత్ర సమర్పకుడు, పారిజాత హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ చైర్మన్‌ టి.అంజయ్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి సెన్సార్‌ అధికారులు మంచి ప్రశంసలు ఇచ్చి, క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా మా సినిమాను రూపొందించాం’’ అన్నారు.

‘‘సినిమా తీయడం ఈజీ కాదని ఈ రంగంలోకి వచ్చాకే తెలిసింది. మా సినిమా మొదలైన తర్వాత ‘ప్రసాద్‌ ల్యాబ్‌లో మురిగిపోయే మరో సినిమా’ అని కొందరు వాగారు. ఎవరికైనా సహకరించక పోయినా ఫర్వాలేదు కానీ, ఇలా మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దు’’ అన్నారు ఈశ్వర్‌. ‘‘చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజేష్‌ కుమార్‌. ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలుపుతుంది’’ అని శ్రీధర్, నరేష్‌ అన్నారు. ధనరాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జై.యం.
∙రాజేశ్, ప్రజ్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement