ఫర్‌ ఎ చేంజ్‌... | Pranitha Subhash turns Software employee | Sakshi
Sakshi News home page

ఫర్‌ ఎ చేంజ్‌...

May 25 2018 4:20 AM | Updated on May 25 2018 4:20 AM

Pranitha Subhash turns Software employee  - Sakshi

‘‘నేను చూజ్‌ చేసుకుంటున్న రోల్స్‌ వల్ల నన్ను అందరూ  తెలుగు అమ్మాయే అనుకుంటున్నారు’’ అన్నారు హీరోయిన్‌ ప్రణీత. ‘బావ, రభస, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం’ తదితర సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్‌. ప్రస్తుతం రామ్‌ హీరోగా చేస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో  ప్రణీత ఓ ఇంపార్టెంట్‌ రోల్‌  ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో నేనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో కనిపిస్తాను.

ఇది వరకు నేను చేసిన క్యారెక్టర్‌లా ఉండదు. అర్బన్‌ అమ్మాయిగా, కొంచెం గ్లామరస్‌గా నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ నా ఇమేజ్‌ని కంప్లీట్‌గా చేంజ్‌ చేస్తుందనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను అన్నీ హోమ్లీ టైప్‌ క్యారెక్టర్స్‌ ప్లే చేశాను. అన్నీ ట్రెడిషనల్‌ రోల్స్‌ ప్లే చేయడంతో ఎక్కువగా శారీల, జ్యువెలరీ యాడ్స్‌ వస్తుండేవి. ఆడియన్స్‌ ఎక్కడైనా కలసినా కూడా తెలుగులో మాట్లాడుతుంటారు. తెలుగమ్మాయిలా వాళ్లు నన్ను దగ్గర చేసుకున్నారు’’ అని పేర్కొన్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement