వెబ్‌ సిరీస్‌ బాటలోకి విలక్షణ నటుడు | Prakash Raj Will Act In Web Series | Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌లోకి ప్రకాష్‌ రాజ్‌

Jul 2 2020 11:59 AM | Updated on Jul 2 2020 12:29 PM

Prakash Raj  Will Act In Web Series - Sakshi

ప్రకాష్‌ రాజ్‌ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి రచయిత, దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ధోని’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆయన ఒక వెబ్‌ సిరీస్‌కి రచయితగా చేయడంతో పాటు ఇందులో ఒక లీడ్‌ రోల్‌ కూడా చేస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే. ఇదిలా ఉంటే.. ఈ లాక్‌డౌన్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా వలస కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లడానికి ఆయన సహాయం చేశారు. 44 మంది వలస కార్మికులకు తన ఫామ్‌హౌస్‌లో బస కల్పించి, వాళ్లంతా తమ ప్రాంతాలకు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేశారు. ‘భరత్‌ అనే నేను’లో మహేశ్‌బాబు ‘ఐయామ్‌ నాట్‌ డన్‌ ఎట్‌’ అని ఓ డైలాగ్‌ చెబుతారు. అలాగే సేవా కార్యక్రమాల పరంగా ‘ఐయామ్‌ నాట్‌ డన్‌ ఎట్‌’ అంటున్నారు ప్రకాష్‌రాజ్‌. ఇంకా ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement