టాలీవుడ్కు మెరుపుతీగ రీ ఎంట్రీ | Prabhu Deva direct a Telugu film once again | Sakshi
Sakshi News home page

టాలీవుడ్కు మెరుపుతీగ రీ ఎంట్రీ

Oct 19 2016 8:29 AM | Updated on Sep 4 2017 5:42 PM

టాలీవుడ్కు మెరుపుతీగ రీ ఎంట్రీ

టాలీవుడ్కు మెరుపుతీగ రీ ఎంట్రీ

ఇండియన్ మైకేల్ జాక్సన్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. డ్యాన్సర్ గానే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు సాధించిన ఈ మెరుపు తీగ, తరువాత దర్శకుడిగానూ...

ఇండియన్ మైకేల్ జాక్సన్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. డ్యాన్సర్ గానే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు సాధించిన ఈ మెరుపు తీగ, తరువాత దర్శకుడిగానూ సత్తా చాటాడు. బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకొని వరుస వంద కోట్ల సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయాడు.

నార్త్లో ఇంత సాధించినా.. ప్రభుదేవా దర్శకుడిగా మారింది మాత్రం తెలుగు సినిమాతోనే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా, తరువాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తరువాత బాలీవుడ్ వెళ్లిపోయి, సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.

ఇటీవలే నిర్మాతగా మారి సౌత్లో అడుగుపెట్టిన ప్రభుదేవా.. మరోసారి తన సొంత గడ్డ పై ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనకు దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే స్టార్ హీరోలతో కాకుండా మినిమమ్ బడ్జెట్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ప్రభుదేవా మరోసారి తెలుగు ప్రేక్షకులతో నువ్వొస్తానంటే మేమొద్దంటామా అని అనిపిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement