రెండు భాషలపై కన్ను! | prabhas focus on two languages | Sakshi
Sakshi News home page

రెండు భాషలపై కన్ను!

Apr 1 2017 12:49 AM | Updated on Sep 5 2017 7:35 AM

రెండు భాషలపై కన్ను!

రెండు భాషలపై కన్ను!

ప్రభాస్‌ ఎవరనేది ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు.

ప్రభాస్‌ ఎవరనేది ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ఈ యంగ్‌ హీరోకి ‘బాహుబలి’తో ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. తెలుగుతో పాటు ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో ప్రభాస్‌కు అభిమానులున్నారు. అందువల్ల, ‘బాహుబలి’ తర్వాత బైలింగ్వల్, మల్టీ లింగ్వల్‌ సినిమాలు చేయాలని ప్రభాస్‌ నిర్ణయించుకున్నారు. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో నటించే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేస్తున్నట్టు ప్రకటించారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించే సినిమానూ మల్టీ లాంగ్వేజెస్‌లో తీయాలనుకుంటున్నారట.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో ప్రభాస్‌ సినిమా చేయనున్నారనేది చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన రెండు తమిళ సినిమాలు (‘రాజా రాణి’, ‘పోలీస్‌’) తెలుగులో అనువాద మయ్యాయి. రెండిటికీ తెలుగులో మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ‘పోలీస్‌’లో తమిళ మాస్‌ హీరో విజయ్‌ను చూపించిన తీరు ప్రభాస్‌కు నచ్చిందట! దాంతో అట్లీకి కబురు చేసి, తెలుగు, తమిళ బైలింగ్వల్‌ సినిమాకు కథ ఉంటే చెప్పమని అడిగారట.

హీరో, దర్శకుల మధ్య చర్చలు జరిగినట్టు భోగట్టా. ప్రస్తుతం విజయ్‌ హీరోగా అట్లీ ఓ సినిమా చేస్తున్నారు. బహుశా ఆ సినిమా పూర్తయ్యాక ప్రభాస్‌ సినిమా ప్రారంభిస్తారేమో! ఈలోపు సుజీత్, రాధాకృష్ణ సినిమాలను ప్రభాస్‌ పూర్తి చేయాలనుకుంటున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement