పోసానితో నాకు ఎలాంటి విభేదాలు లేవు...

Posain Krishna Murali Just Like My Brother, sasy Prudhvi Raj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సినీనటుడు పోసాని కృష్ణమురళికి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎస్వీబీసీ చానల్‌ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్‌ ఖండించారు. ఆయన ఆదివారం  హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వచ్చిన వార్తల్లో స్తవం లేదని, ఆయన తన సోదరుడి లాంటివారని పృధ్వీ పేర్కొన్నారు. స్వీబీసీ చానల్‌లో ఐడీ కార్డు వేసుకుని తాను కూడా ఓ ఉద్యోగిగా కొనసాగుతానని తెలిపారు. చానల్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ భక్తి చానల్‌ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

చానల్‌ చైర్మన్‌గా కీర్తి ప్రతిష్టలు పెంచుతానన్నారు. భక్తి చానల్‌లో గతంలో జరిగిన అక్రమాలపై మాట్లాడుతూ.. ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం తమ ముఖ్యమంత్రికి గానీ, తనకు గానీ లేవన్నారు. ప్రస్తుతం రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నానని చెప్పారు. ఎవరైనా గతంలో అక్రమాలు చేశారని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top