‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

Poor Collections For Bellamkonda Sai Sreenivas Rakshasudu - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ రాక్షసుడు. తమిళ సినిమా రాక్షసన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగులోనూ పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. చాలా కాలం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో చిత్రయూనిట్ హ్యాపీగా ఉన్నారు. అయితే కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు.

సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘సీత’ డిజాస్టర్‌ కావటంతో ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు వసూళ్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా కేవలం 2.3 కోట్ల షేర్‌ మాత్రమే సాధించగలిగింది. వీకెండ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నుంచి వసూళ్లు మరింతగా పడిపోతాయన్న టెన్షన్‌ నిర్మాతల్లో కనిపిస్తుంది.

దీనికి తోడు వచ్చే వారం మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు 2’, భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’తో పాటు అనసూయ లీడ్‌ రోల్‌లో నటించిన ‘కథనం’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ పరిస్థితుల్లో రాక్షసుడు సేఫ్‌ జోన్‌లోకి వస్తాడా లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 17 కోట్లకు పైగా షేర్‌ సాధించాల్సి ఉంటుంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top