రాజకీయ నేపథ్యంగా కో-2 | political backdrop Co -2 | Sakshi
Sakshi News home page

రాజకీయ నేపథ్యంగా కో-2

Apr 10 2016 2:24 AM | Updated on Sep 17 2018 4:52 PM

రాజకీయ నేపథ్యంగా కో-2 - Sakshi

రాజకీయ నేపథ్యంగా కో-2

కో-2 చిత్రం మే 6న తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్‌ఎస్.

కో-2 చిత్రం మే 6న తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్‌ఎస్.ఇన్ఫోటెయిన్‌మెంట్ సంస్థ అధినేత ఎల్‌రెడ్. కుమార్ నిర్మించిన తాజా చిత్రం కో-2. నవ దర్శకుడు శరత్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీతలు బాబీసింహా, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నటి నిక్కీగల్రాణి కథానాయకిగా నటించిన ఇందులో నటుడు బాలా శరవణన్ కీలక పాత్రలో నటించారు.
 
  ప్రపంచ వ్యాప్తంగా ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు కల్గిన రంగాలు రాజకీయం, మీడియా. రాజకీయాల్లో మీడియా ప్రధాన భూమికను పోషిస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మీడియా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి ఇతి వృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం కో-2 అన్నారు చిత్ర నిర్మాత.
 
 ఇందులో నటుడు బాబీసంహా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందనీ. ఈ చిత్రం ఆయన కేరీర్‌ను మంచి మలుపు తిప్పుతుందనే నమ్మకం ఆశాభావంతో ఆయన ఉన్నట్లు పేర్కొన్నారు. నిక్కీగల్రాణి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఈ పాత్ర చిత్రం అంతా ఉంటుందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అంతకు ముందే రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన కో-2 చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement