పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..! | Pelli Choopulu Director second Movie | Sakshi
Sakshi News home page

పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..!

Aug 6 2017 3:36 PM | Updated on Sep 17 2017 5:14 PM

పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..!

పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..!

2016లో రిలీజ్ అయిన పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయం సాదించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.

2016లో రిలీజ్ అయిన పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయం సాదించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు రెండో సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ తన రెండు సినిమాను ప్రారంభించాడు తరుణ్. పెళ్లిచూపులు సినిమా ప్రమోషన్ లో రిలీజ్ విషయంలో ఎంతో తోడ్పాటు అందించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే రెండో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే కథా కథనాలు ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కొత్త నటీనటులతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement