విదేశాలకు  ఏంజిల్‌

Payal Rajput will not be seen in India for a month - Sakshi

నెల రోజులు పాయల్‌ రాజ్‌పుత్‌ ఇండియాలో కనిపించరు. అరే.. చేతిలో సినిమాలు ఉన్నాయి. అన్ని రోజులు హాలీడే తీసుకుంటే ఎలా? అనే సందేహం మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆమె విదేశాలకు వెళ్లింది ఓ తమిళ సినిమా షూటింగ్‌ కోసమే. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా కేఎస్‌ అదియమాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘ఏంజిల్‌’. ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు పాయల్‌. మరో కథానాయికగా ఆనంది కనిపిస్తారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ చెన్నైలోని ఓ యూనివర్శిటీలో జరిగింది. సెకండ్‌ షెడ్యూల్‌ కోసం ఫిజీ వెళ్లారు.

‘‘ఏంజిల్‌’ సెకండ్‌ షెడ్యూల్‌ కోసం ఫిజీ వెళ్తున్నాను. నెల రోజులు అక్కడే ఉంటాను’’ అన్నారు పాయల్‌. అంటే పాయల్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే అన్నమాట. ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారట ఈ బ్యూటీ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top