పిల్లలతో పవన్ జాలీ ట్రిప్ | Pawan kalyan Vacation With Three Kids and Wife | Sakshi
Sakshi News home page

పిల్లలతో పవన్ జాలీ ట్రిప్

Jul 27 2017 10:09 AM | Updated on Mar 22 2019 5:33 PM

పిల్లలతో పవన్ జాలీ ట్రిప్ - Sakshi

పిల్లలతో పవన్ జాలీ ట్రిప్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్.. పాటల చిత్రీకరణ కోసం బల్గేరియా వెళ్లింది. అయితే ఎప్పుడు తన సినిమా షూటింగ్ లకు ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్లడానికి ఇష్టపడని పవన్ ఈ సారి మాత్రం తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకొని బల్గేరియా వెళ్లాడు.

రేణుదేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యాలతో పాటు అన్నాలెజినోవా కూతురు పోలెనాలను తనతో పాటు బల్గేరియా తీసుకెళ్లాడు. బల్గేరియా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సమయంలో ఎయిర్ పోర్ట్ లో మీడియా కెమెరా కంట పడ్డాడు. పవన్ తో అకీరా, ఆద్యా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో పవన్ తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు.

వరుసగా సినిమాలకు కమిట్ అవుతుండటంతో పాటు త్వరలో రాజకీయాల్లోనూ బిజీ అవుతాడని భావిస్తున్న పవర్ స్టార్, పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకే వెంట తీసుకెళ్లాడని భావిస్తున్నారు. ఈ ఫోటోలలో లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్ ను చూసి ఫ్యాన్స్  ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల అకీరాలో ఇప్పుడే హీరో ఫీచర్స్ కనిస్తుండటంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఖాయం అని భావిస్తున్నారు. పవన్ కన్నా ఎత్తు పెరిగిన అకీరా, ఇప్పటికే రేణు దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement