అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ | pawan kalyan meet injured fan family | Sakshi
Sakshi News home page

అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ

Jan 6 2015 5:45 PM | Updated on Mar 22 2019 5:33 PM

అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ - Sakshi

అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ

దుండగుడి దాడిలో గాయపడిన అభిమాని కరుణ శ్రీనివాస్ ను హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం పరామర్శించారు.

హైదరాబాద్: 'గోపాల గోపాల' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దుండగుడి దాడిలో గాయపడిన అభిమాని కరుణ శ్రీనివాస్ ను హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం పరామర్శించారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో కలిశారు.

అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ భార్యాపిల్లలతో మాట్లాడారు. దాదాపు గంటసేపు వారితో గడిపారు. అతడి వైద్యానికి అయిన ఖర్చులతో పాటు మరో యాభైవేల రూపాయాల సహాయం ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement