అనుష్కలా సినిమాలు చేయాలనుంది | Palak Lalwani: I'm a big fan of Mahesh Babu | Sakshi
Sakshi News home page

అనుష్కలా సినిమాలు చేయాలనుంది

Feb 20 2018 12:58 AM | Updated on Feb 20 2018 12:58 AM

Palak Lalwani: I'm a big fan of Mahesh Babu - Sakshi

పాలక్‌ లల్వానీ

‘‘అనుష్క, సాయి పల్లవి చేస్తున్నట్లుగా డిఫరెంట్, స్ట్రాంగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను. కానీ నేను స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి దర్శకులను నమ్మి సినిమాలు చేస్తాను. ఆ తర్వాత నా ఛాయిస్‌కి తగ్గ రోల్స్‌ సెలెక్ట్‌ చేసుకుంటాను’’ అన్నారు హీరోయిన్‌ పాలక్‌ లల్వానీ. రంజిత్, పాలక్‌ లల్వానీ జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్‌ త్రికోటి దర్శకత్వంలో భరత్‌ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. కీరవాణి స్వరకర్త. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ పాలక్‌ లల్వానీ మాట్లాడుతూ – ‘‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో నా నటన చూసి దర్శకుడు త్రికోటì గారు ఈ సినిమా కోసం సెలెక్ట్‌ చేశారు.

ఈ సినిమా కథ బాగా నచ్చింది. రంజిత్‌ మంచి కో–స్టార్‌. అతను చాలా బాగా చేశాడు. నా ఫస్ట్‌ సినిమా అనుకున్నంత సక్సెస్‌ సాధించలేదు. కానీ అది నన్ను అంతగా ఎఫెక్ట్‌ చేయలేదు. ఎందుకంటే సినిమా రిజల్ట్‌ హీరోయిన్లను అంతగా ఎఫెక్ట్‌ చేయవని అనుకుంటున్నాను. ప్రస్తుతం తమిళంలో జీవీ ప్రకాష్‌తో ఓ సినిమా, ‘కేరింత’ ఫేమ్‌ విశ్వాంత్‌ సరసన ఓ సినిమా చేశాను. అవి రెండూ పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నాయి. ఫ్యూచర్‌లోనూ మంచి రోల్స్‌ సెలెక్ట్‌ చేసుకుంటాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement