మలేషియా ప్రేక్షకుల ముందుకు ‘ఒన్‌ హార్ట్‌’ | One Heart movie is preparing to entertain Malaysian audience | Sakshi
Sakshi News home page

మలేషియా ప్రేక్షకుల ముందుకు ‘ఒన్‌ హార్ట్‌’

Aug 29 2017 4:34 AM | Updated on Sep 17 2017 6:03 PM

మలేషియా ప్రేక్షకుల ముందుకు ‘ఒన్‌ హార్ట్‌’

మలేషియా ప్రేక్షకుల ముందుకు ‘ఒన్‌ హార్ట్‌’

ఒన్‌ హార్ట్‌ చిత్రం ముందుగా మలేషియా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

తమిళసినిమా:  ఒన్‌ హార్ట్‌ చిత్రం ముందుగా మలేషియా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. సం గీతంలో ప్రయోగాల రారాజుగా ప్రసిద్ధికెక్కిన సంగీతమాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ తన సంగీత ఝరితో ప్రపంచ సంగీత ప్రియులను మైమరపించి ఏకంగా రెండు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా ఒన్‌ హార్ట్‌ చిత్రంతో ప్రేక్షకులకు సంగీత అమృతాన్ని అందించి ఆస్వాదింపజేయడానికి రెడీ అయ్యారు.

కాన్సర్ట్‌ జానర్‌ పేరుతో హాలీవుడ్‌లో విడుదలవుతున్న చిత్రాల తరహాలో ఏఆర్‌.రెహ్మాన్‌ బ్రహ్మాండ సంగీత విభావరి కార్యక్రమాలతో మిళితంగా రూపొందిన చిత్రం ఒన్‌ హార్ట్‌. ఇందులో రెహ్మాన్‌తో పాటు పని చేసిన ప్రముఖ సంగీత కళాకారులు ఆడి పాడిన సన్నివేశాలు ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్పవచ్చు. ఈ ఒన్‌ హార్ట్‌ చిత్ర మలేషియా హక్కులను పొం దిన మాలిక్‌ స్ట్రీమ్స్‌ కార్పొరేషన్‌ అధినేత మాలిక్‌ ఈ చిత్రాన్ని ఈ నెల 30 రాత్రి 20,000 ప్రేక్షకులు కలిసి చూసే ఆవరణలో విడుదల చేయబోతున్నట్లు తెలి పారు. అలాగే మలేషియాలో 100కు పైగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్రం ఇండియాలో సెప్టెంబరు 7వ తేదీన విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement