ఫ్లై-ఓవర్‌పై లవ్ ఎటాక్ | Oka Ammayi Thappa Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ఫ్లై-ఓవర్‌పై లవ్ ఎటాక్

May 27 2016 11:16 PM | Updated on Sep 15 2019 12:38 PM

ఫ్లై-ఓవర్‌పై లవ్ ఎటాక్ - Sakshi

ఫ్లై-ఓవర్‌పై లవ్ ఎటాక్

హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉండే ఫ్లై- ఓవర్ అది. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఆ ఫ్లై-ఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది.

హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉండే ఫ్లై- ఓవర్ అది. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఆ ఫ్లై-ఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ట్రాఫిక్... ఒక్క పక్క ఎండ...మరో పక్క హారన్ల మోత.. ఇంత చిరాకులో ఈ సినిమాలో హీరోకి లవ్ ఎటాక్ అయి... హార్ట్ బీట్ కూడా జామ్ అయింది. అంతే ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ ... ఈ అమ్మాయి తప్ప.. అనుకుంటూ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఫ్లై-ఓవర్ మీద మొదలైన ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలియాలంటే ‘ఒక్క అమ్మాయి తప్ప’ చూడాలంటున్నారు రాజసింహ.

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘‘సందీప్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచిపోతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘సినిమాలో ఎక్కువ భాగం ఫ్లై ఓవర్ మీదే జరుగుతుంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు, సహ నిర్మాతలు: మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement