ఓ మల్లిక గాథ

ఓ మల్లిక గాథ


గిరిజన నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఓ మల్లి’. రమ్యశ్రీ కథానాయికగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. రమ్యశ్రీ మాట్లాడుతూ- ‘‘ఓ గిరిజన జంట మధ్య సాగే అనుబంధమే ఈ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఈ సినిమా రూపొందించాం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, బి.ఎస్. కృష్ణమూర్తి, సినిమాటోగ్రఫీ: కె.దత్తు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top