క్యూట్‌ లవ్‌స్టోరీ

Nuvvakkada Nenikkada Movie Opening - Sakshi

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం, సిమ్రాన్‌ జంటగా పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వక్కడ నేనిక్కడ’. తాని గంగిరెడ్డి, కీర్తన వెంకటేష్‌ నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత కేకే  రాధామోహన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో నిర్మాత, పంపిణీదారుడు పారస్‌ జైన్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ఆర్‌బీ చౌదరి పూజలో పాల్గొన్నారు. పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్‌ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

యూత్‌ఫుల్‌ కథాంశంతో క్యూట్‌ లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఈ నెల 15న రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు పార్వతీశం. ‘‘డైరెక్టర్‌ని, కథను నమ్మి నిర్మిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆచంట రాంబాబు.
∙సిమ్రాన్, పార్వతీశం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top