అసామాన్యుడు | NTR28 Movie Is Rayalaseema Backdrop! | Sakshi
Sakshi News home page

అసామాన్యుడు

May 6 2018 12:37 AM | Updated on May 6 2018 12:37 AM

NTR28 Movie Is Rayalaseema Backdrop! - Sakshi

కష్టమైన డైలాగ్స్‌ కూడా ఎన్టీఆర్‌ నోటి నుంచి సులభంగా వచ్చేస్తాయి. ఆయనలో ఆ సత్తా ఉంది. అందుకు ఓ నిదర్శనం ‘అదుర్స్‌’ సినిమాలో చేసిన బ్రాహ్మణ కుర్రాడి పాత్ర. రీసెంట్‌గా ‘జై లవకుశ’ సినిమాలో నత్తిగా మాట్లాడే జై క్యారెక్టర్‌ను అద్భుతంగా చేశారు. ఇప్పుడు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ను అదరగొట్టనున్నారట ఎన్టీఆర్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఎస్‌. రాధకృష్ణ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఆల్మోస్ట్‌ చిత్తూరు యాసలోనే డైలాగ్స్‌ పలుకుతారని సమాచారం.

అందుకోసం నానీ హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో  చిత్తూరు యాసలో ‘దారి చూడు మామా’ అనే మాసీ సాంగ్‌ రాసి, పాడిన పెంచల్‌ దాస్‌ను బోర్డ్‌లోకి తీసుకున్నారట. ఆయన ఎన్టీఆర్‌కు చిత్తూరు యాసలో ట్రైనింగ్‌ ఇస్తారని టాక్‌. అంతేకాదు ఈ సినిమాకు ‘సింహనంద, అసామాన్యుడు’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement